హైందవజాతికి స్ఫూర్తినిచ్చిన మహానీయుడు ఛత్రపతి శివాజీ అని విశ్వహిందూ పరిషత్ నేత చల్లా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక సమితి ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోని ఆదిశంకర మార్గ్‌లో శనివారం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భవానీ వీర శివాజీ.. జైభవానీ.. వీరశివాజీ.. సంఘటనమే శక్తి హై అంటూ విజ్ఞాన విహార్ పాఠశాలతోపాటు నగరానికి చెందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శివాజీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు నాగలింగం శివాజీ, వివిధ సంఘాలకు చెందిన కొణకల సురేష్, కృష్ణభగవాన్, సూర్యతేజ పాల్గొన్నారు. – విజయవాడ కల్చరల్


