విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
రేషనలైజేషన్ పేరిట కత్తిపెట్టిన వైనం ఇప్పటికే మూతపడిన 60 రైతు సేవ కేంద్రాలు సిబ్బంది సైతం సర్దుబాటు అన్నదాతల అవస్థలు పట్టించుకోని ప్రభుత్వం
నిర్వీర్యం చేస్తున్నారు..
గతంలో బాగా పనిచేశాయి..
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
రైతు సేవలకు మంగళం పాడుతున్న చంద్రబాబు సర్కారు
వీఏఏలపై పనిభారం..
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నందు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక( పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభమవుతాయని కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి ఐసీఏఐ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను పంపించారు. కాగా కూరగాయల వాహనాన్ని ఆదివారం గవర్నర్ పేటలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ఐసీఏఐ విజయవాడ చాప్టర్ అధ్యక్షుడు డి. ప్రసన్నకుమార్, ఇతర సభ్యులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవను సుస్థిరతతో అనుసంధానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చైర్మన్ జయంత్ ఉప్పులూరి, ఆక్స్ ఆఫిషియో సభ్యుడు ముప్పాల సుబ్బారావు వేమూరు వీర పావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం సీనియర్ పురుషుల కృష్ణాజిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 14 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లుగా ఆ సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎం. నరేంద్రబాబు చెప్పారు. మరో నలుగురు క్రీడాకారులను స్టాండ్‌బైగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు మార్చి 7వ తేదీన ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ బాల సుబ్రహ్మణ్యం ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక తహసీల్దార్ ఎం. హరనాథ్, అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ పి. గౌతమ్‌కుమార్ పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగమైన యూరాలజీలో రెండు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఆ విభాగంలో ఇద్దరు పీజీ విద్యార్థులు అడ్మిషన్లు పొందనున్నారు. ఇప్పటికే న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు ఉండగా, తాజాగా మరో విభాగంలో మంజూరయ్యాయి. కాగా 2020లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం అనంతరం యూరాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి అందిస్తున్న నాణ్యమైన సేవలకు గాను, ఎన్‌ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేశారు. యూరాలజీ పీజీ సీట్లు వచ్చేందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావును విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్‌ను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ గోవింద్, డాక్టర్ ప్రభాకర్, ఇతర టీచింగ్ అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూది ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట పటిమ చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గుజరాత్‌లోని వడోదరలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 72వ సీనియర్ జాతీయ పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేశామని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.శ్రీకాంత్ ప్రకటనలో ఆది వారం తెలిపారు. ఇండియా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీకి జట్టు కెప్టెన్‌గా పి.దుర్గారావు(తూర్పు గోదావరి), పి.గోపి(పల్నాడు), జి.లక్ష్మారెడ్డి(బాపట్ల), ఎన్.తేజ (విశాఖపట్నం), సీహెచ్ నాగబాబు (కాకినాడ), కె.రాంబాబు(తిరుపతి), కె.ఫణేంద్ర(ఎన్టీఆర్), పి.బ్రహ్మారెడ్డి(బాపట్ల), కె.దినేష్ (తిరుపతి), జి.పవన్ కుమార్ (కృష్ణ), కె.హరి ప్రసాద్ రెడ్డి(బాపట్ల), కె.మనోహర్ (కాకినాడ), జి.హరీష్ (పల్నాడు), ఎస్‌కే బాషా(గుంటూరు), జట్టుకు కోచ్‌గా టి.సుధాకర్, జట్టు మేనేజర్‌గా కె.మహేష్‌లు ఎన్నికయ్యారన్నారు. క్రీడాకరులను రైల్వే శాఖ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు డైరెక్టర్ కె.రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కల అర్జునరావు, జాయింట్ సెక్రటరీ నాంచారయ్య అభినందించారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వ్యవ‘సాయానికి’ చిరునామాగా ఉండి.. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల అడ్రస్ గల్లంతవుతోంది. రైతుల అవస్థలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు కేంద్రాల పేరు మార్చి.. నిర్వీర్యం చేస్తోంది. రేషనలైజేషన్ పేరిట కత్తికట్టి, కేంద్రాలను కుదిస్తోంది. అన్నదాతలకు విత్తనం నుంచి విక్రయం వరకూ ఇబ్బందుల పాల్జేస్తోంది.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులు తమ అవసరాలకు గ్రామం దాటి వెళ్లకూడదని, అన్ని సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకేలు) ప్రారంభించింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలు ఆర్బీకేలలో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కో ఆర్బీకేలో వ్యవసాయ సహాయకుడు, ఉద్యాన సహాయకుడు, వెటర్నరీ సహాయకుడు ఇలా సిబ్బందిని నియమించింది. సిబ్బంది ద్వారా వ్యవసాయదారులకు సూచనలు, సలహాలు, భూ సార పరీక్షలు, ఈ–క్రాప్ నమోదు చేయడం ద్వారా పంటలకు బీమా సౌకర్యం కల్పించడం వంటి సేవలను అందించింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచింది. పంటలు వాటి మద్ధతు ధరల వివరాలు డిస్ ప్లే చేసింది. రైతులు పండించిన పంటలు కొనుగోలు మద్ధతు ధరలకు కొనుగోలు చేసేలా నాటి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి తెచ్చింది. ఆ ఐదేళ్లు ఆర్బీకేలు రైతులతో కళకళలాడాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఇదంతా గతం.
ఇప్పుడు అధ్వానం..
తాము అధికారంలోకి వస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నమ్మబలికి చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయింది. గత ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలు(ఆర్ ఎస్‌కే)గా పేర్లు మార్చింది. రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా కేంద్రాలను కుదించింది. జిల్లాలో మొత్తం 60 కేంద్రాలకు తాళాలు వేసింది. రెండు, మూడు కేంద్రాలను కలిపి ఒకటిగా చేసింది. సిబ్బందిని సర్దుబాటు చేసింది. మిగిలిన పోయిన ఆర్బీకేల నిర్మాణం పూర్తి చేయకపోగా ఉన్నవాటికే తాళం వేసింది. ఆయా చోట్ల రైతులకు సూచనలు, సలహాలు ఇలా సేవలన్నింటికి స్వస్తి పలికింది. ఫలితంగా వ్యవసాయం తిరోగమనంలోకి వెళుతోంది. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. ఆర్‌ఎస్‌కేలలో గిట్టుబాటు ధరల సమాచారమే అందుబాటులో లేదు. లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. మొత్తంగా రైతు సేవా కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
207
మొత్తం
సిబ్బంది
267
మొత్తం రైతు భరోసా కేంద్రాలు
207
రేషనలైజేషన్ తర్వాత
మిగిలినవి
75
అసలు ప్రారంభం కానివి
ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి
98
భవన నిర్మాణాలు పూర్తయినవి
20
నిర్మాణం పూర్తయి ప్రారంభం కాని
భవనాలు
– పుల్లేటి నాగ మల్లేశ్వరరావు,
సహకార ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉప కార్యదర్శి
– ఎం. రామకృష్ణ, సహకార సంఘ సీఈఓ, వేమవరం
స్టాళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియ తదితరులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయానికి చేరువ కావాలని, భావితరాల బంగారు భవిష్యత్‌కు ప్రకృతి సాగే కీలకమని వక్తలు పేర్కొన్నారు. సేంద్రియ సాగును ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ ఫార్మర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం ఆదివారం జరిగింది. ప్రకృతి సాగును ముందుకు తీసుకెళ్తామని ప్రజాప్రతినిధులు రైతులు ప్రతిజ్ఞ చేశారు.
విస్తృతంగా అవగాహన..
● దేశీయ గో ఉత్పత్తుల కేంద్రం, రైతు సాధికార సంస్థ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్‌పుట్స్, పీఆర్‌ఐటీహెచ్‌యూ (రీజెన్ అగ్రి కార్బన్ ప్రాజెక్టు), వన్ ఎర్త్ – వన్ లైఫ్ టెర్రాస్ గార్డెన్, సాయిశ్రీనివాస్ గోశాల, స్వయం సహాయక సంఘాల ఆర్గానిక్ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, ఆరోగ్య వనం తదితర స్టాళ్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్ సాగుతో పాటు ఉత్పత్తుల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
● ప్రబాల్ తోమర్ (కిసాన్ లెడ్జర్), ఆశా కిరణ్ (అమరావతి ఆర్గానిక్), రఘురాం (భూమి ఆర్గానిక్) తదితర ప్రకృతి సేద్యం, ఉత్పత్తుల రంగ నిపుణులు మార్కెట్ లింకేజీలపై అవగాహన కల్పించారు.
● రైతులు తాము పండించిన ప్రకృతి సేద్య ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
● వినియోగదారుడు కూడా తనకు నాణ్యమైన ప్రకృతి సేద్య ఉత్పత్తులే కొనుగోలు చేశాననే విశ్వాసం పెంపొందించేలా తీసుకొచ్చిన ట్రేసబులిటీపై కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయకుమార్ మాట్లాడుతూ 2030 నాటికి రాష్ట్రంలోని ప్రతిరైతుకూ ప్రకృతి వ్యవసాయాన్ని చేరువ చేస్తామన్నారు. ప్రకృతి ‘వ్యవసాయం వెనుక శాసీ్త్రయత అనే అంశం’పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, జేసీ ఎస్.ఇలక్కియ, డీపీఎం వై.శంకర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవంలో వక్తలు
రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం పూర్తి గా నిర్వీర్యం చేస్తోంది. గ్రామాల్లో రైతులకు సాగు విషయంలో వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడేది. ప్రస్తుతం ఆర్‌బీకేలలో పని చేసే అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్లకు ఇతర పనులు అప్పగించడంతో గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయ సమాచారం ఇచ్చేవారే కరువయ్యారు.
– ఉన్నం శ్రీనివాసరావు, రైతు, అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలు మండలం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా ఎరువులు, పురుగు మందులు అందించేవారు. అంతే కాకుండా పంటల రైతు భరోసా, పంట నష్ట పరిహారాలు కూడా సకాలంలో అందేవి. ఈ–క్రాప్ నమోదు చేసి పంటల బీమా కల్పించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. చాలా ఇబ్బందిగా ఉంది.
– కొండబోలు శ్రీను, రైతు, మక్కపేట,
వత్సవాయి మండలం
ఒక్కో ఆర్‌ఎస్‌కేలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ) అందుబాటులో ఉండేవారు. ప్రారంభంలో జనాభా ప్రాతిపదికన వీఏఏల నియామకం జరిగింది. ఇపుడు రేషనలైజేషన్ పేరుతో పంట సాగు విస్తీర్ణం ఆధారంగా వీఏఏలను సర్దుబాటు చేశారు. రెండుమూడు ఆర్‌ఎస్‌కేలను విలీనం చేయడంతో ఆ భారమంతా ఒక వీఏఏపై పడుతోంది. ఈ–క్రాప్ నమోదు, వ్యవసాయ సంబంధిత విధులే కాకుండా ఇతర సర్వేలు కూడా చేయిస్తుండటంతో వారిపై భారం పడుతోంది. ఉద్యాన సహాయకులైతే ఒక్కో మండలంలో మూడు గ్రామాలకు ఒకరు చొప్పున ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఆర్‌ఎస్‌కేలను ఉంచుతుందా లేదా అన్న ఆందోళనలో వారు ఉన్నారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


