ప్రశాంతంగా వీఎంసీ కౌన్సిల్
ప్రశాంతంగా వీఎంసీ కౌన్సిల్ ● 2019 నుంచి ఈ ఏడాది వరకు కేంద, రాష్ట్ర ప్రభుత్వాలు విజయవాడ నగరాభివృద్ధికి వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధుల వివరాలను సభ్యులకు తెలపాలని సీపీఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు కోరగా.. కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.249.43 కోట్లు ఇవ్వగా ఇప్పటి వరకు రూ.75.43 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.157.32 కోట్లు ఖర్చుచేయాల్సి ఉందని అధికారులు సమాధానం ఇచ్చారు. పీఎఫ్‌ఎంఎస్ –15వ ఆర్థిక సంఘం నుంచి రూ.265.97 కోట్ల నిధులు రాగా రూ.223.37 కోట్లు ఖర్చు చేశా మని రూ.42.49 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.341.18 కోట్లు రాగా రూ.340.59 కోట్లు ఖర్చు చేశామని అధికా రులు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీజీఎంపీ ద్వారా రూ.37.57 కోట్లు మంజూరవగా రూ.13.85 కోట్లు ఖర్చు చేశామని, ఎయిర్‌పోర్టు కారిడార్, రివర్ ఫ్రంట్ పార్కు నిర్మాణానికి రూ.16.71 కోట్లు, వైఎస్సార్ హౌసింగ్ పథకానికి రూ.6.47 కోట్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రూ.5.15 కోట్లు రాగా రాగా అన్నీ ఖర్చు చేశామని అధికారులు వివరించారు.
● నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని నాడు–నేడు పథకం ద్వారా చేపట్టి పూర్తిచేశారని, కొన్నింటి నిర్మాణాలు ప్రారంభం కాలేదన్న అంశంపై టీడీపీ సభ్యులు రాద్ధాంతం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వారికి దీటుగా జవాబిచ్చారు. నాడు – నేడు ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ బాధ్యతలను సమగ్రంగా చేసిందని, దీన్ని కూటమి ప్రభుత్వం నిలిపివేయటంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొటున్నారని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో సభలో గందరగోళ వాతావరణం నెలకొనగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఐదు నిమిషాలపాటు సభను వాయిదా వేశారు.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంత వరకు ఒక్క రేషన్ కార్డు, వితంతు, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ పింఛన్ మంజూరు చేయలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఆరు నెలలకు డివిజన్లకు వెయ్యి నూతన పెన్షన్‌లను మంజూరు చేసి ఇచ్చారని, దీన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవటంలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు.
● గతంలో పార్కు సెక్షన్ ఆధీనంలోనే పార్కులు, గ్రీనరీ, మొక్కల సంరక్షణ, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ తదితర అంశాలు ఉండేవని, ఇందులో ఈఈ, డీఈ, ఏఈలు ఉద్యానవన విభాగం పర్యవేక్షణలో ఉండేదని దీన్ని ఇంజినీరింగ్ సెక్షన్‌కు విలీనం చేయటం వల్ల పార్కులు, గ్రీనరీ సరైన నిర్వాహణ సక్రంగా ఉండటం లేదని దీన్ని గతంలో మాదిరి తిరిగి పార్కు సెక్షన్‌కు బదలాయించాలని వచ్చిన ప్రతిపాద నపై సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపై సుదీర్ఘ చర్చ ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల ఏర్పాటు నిధులపై సవరణ తీర్మానం పార్కుల్లో సివిల్ వర్క్‌లకు డీడీహెచ్ అజమాయిషీపై తీర్మానం ఆమోదం నాడు–నేడు పనులపై వైఎస్సార్ సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం
ఇన్‌చార్జి సీఈకి మందలింపు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రశాంతంగా జరిగింది. నగరంతోపాటు గన్న వరం, కంకిపాడు, నున్న ప్రాంతాల్లో కూడా వీఎంసీ సాధారణ నిధులతో 15 ట్రాఫిక్ జంక్ష న్లలో సిగ్నళ్లు ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనపై సవరణ తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు నిధుల మంజూరు, విడుదల, నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని ఈ తీర్మానం చేశారు. నగర పాలక సంస్థ సర్వసభ్య సాధారణ సమావేశం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది.
మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి అజెండాలో 169 అంశాలను పొందుపరిచారు. వాటిలో 149 అంశాలను ఆమోదించగా ఏడింటికి ఆఫీస్ రిమార్కులు కోరారు. మరో ఏడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్త్తూ తీర్మానం చేయగా, నాలుగు అంశాలను తిరస్కరించారు. ఒక అంశాన్ని రికార్డు చేయగా, మరో అంశాన్ని ధ్రువీకరించారు.
నిధుల వివరాలు ఇవీ..
కౌన్సిల్‌కు సరైన సమాధానం ఇవ్వటంలేదని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు, చేసే ఖర్చుకు, ఇచ్చే బిల్లులకు సరిపోలటంలేదని మేయర్ రాయన భాగ్యలక్ష్మి సభలో ఇన్‌చార్జి సీఈ సత్యకుమారిని మందలించారు. సర్కిల్ –3 పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా అక్కడ శిలాఫలకం వేయటంలేదని, కార్పొరేటర్ పేరు రాయాల్సి వస్తుందని ఇలా చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. దీనిపై సర్కిల్–3 ఈఈ సామ్రాజ్యం సభ్యులు సంతృప్తి పడేలా సమాధానం ఇవ్వలేదు. దీంతో సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.