ఖర్చు తడిసి మోపెడవుతోంది..
మినుము పైరు బాగుంది. కాపాడుకునేందుకు ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోంది. విత్తనాలు కొనుగోలు చేసి, దుక్కు దున్ని, విత్తనాలు చల్లి, వాటిని తడుపుతూ ఉండటంతో పైరు బాగా ఏపుగా పెరిగింది. పచ్చపురుగు ఆశిస్తుండటంతో పురుగుమందు పిచికారి చేస్తున్నా. ఆరుతడి కూడా అంతంతే. ఆరుతడులు ఇస్తూ పంట పండిస్తున్నా తీరా పంట చేతికి వచ్చిన తరువాత మినుము ధర ఎలా ఉంటుందోననే భయం కూడా వెంటాడుతోంది. ఇప్పటికే ధాన్యం ధర గతేడాడాది కంటే బాగా తగ్గింది.
–జోగి సుబ్రహ్మణ్యం, బల్లిపర్రు, పెడన మండలం


