లైసెన్స్‌డ్ ఇంజినీర్ల సంఘ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా లైసెన్స్‌డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం అయ్యింది. నగరంలోని సత్యనారాయణపురంలో ఎన్టీఆర్ జిల్లా లైసెన్స్‌డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సలహాదారులు డీఎల్ నారాయణ, ఎం.లింగేశ్వరరావు ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా 2025–27 సంవత్సరాలకు నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా వి.రామకృష్ణప్రసాద్, కార్యదర్శిగా అరిగెల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులుగా ఎస్ సుధాకర్, కె.శ్రీహరి, సంయుక్త కార్యదర్శిగా ఏ చంద్రశేఖర్, కోశాధికారిగా పి.సుధాకర్ ఉపకోశాధికారిగా ఎం.మధన్‌మోహన్, న్యాయ సలహాదారులుగా ఇ.బాలాజీ బాబు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎం.విశ్వనాధరావు, కె.శరత్ బాబు, బి.రవిమోహన్‌లతో పాటు మరో 8 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు వి.రామకృష్ణప్రసాద్,అరిగెల చంద్రశేఖర్ మాట్లాడుతూ వీఎంసీ, సీఆర్డీఏ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని అన్నారు. సిబ్బందికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. తమపై నమ్మకంతో తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలను వెల్పేర్ అసోసియోషన్ ఆఫ్ లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ (వాఎల్టీపీ) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.సుధాకర్ నిర్వహించారు.


