
నూతన కార్యవర్గం ఎన్నిక
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వ పాలిటెక్నిక్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆదివారం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎండీ పాషా, జనరల్ సెక్రటరీగా కేసీహెచ్ ప్రధాన్, కోశాధికారిగా కె.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివారావు, పి.శ్రీహరి, జాయింట్ సెక్రటరీగా డీబీఎస్ ప్రసాద్, మహిళా జాయింట్ సెక్రటరీగా సి.సుకీర్త, జోనల్ సెక్రటరీలుగా వి.జక్కన్నబాబు, ఎ.రాంబాబు, ఎస్‌పీసీ ప్రసాద్, పి.నరేష్‌ను ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ 2028 వరకు పదవిలో ఉంటుంది. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కట్లయ్య కమిటీ సభ్యులను అభినందించారు.