
‘వర్ణం’ కవితా సంపుటి ఆవిష్కరణ
విజయవాడకల్చరల్: వర్ణం కవితా సంపుటి ఆవిష్కరణ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయంలో ఆదివారం వైభవంగా జరిగింది. ‘సాక్షి’ స్టేట్ బ్యూరో రిపోర్టర్ బోణం గణేష్ రచించిన ఈ పుస్తకాన్ని ఆర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కామ్రేడ్ జీఆర్‌కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు, అమరావతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి, కార్యవర్గ సభ్యులు లహరి మహేంద్రగౌడ్, నందివాడ చిన్నాదేవి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు
వెంకటాపురం(పెనుగంచిప్రోలు): మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందిమాల సత్యనారాయణ, నల్లబోతుల రామకృష్ణ(బుల్లబ్బాయి) వారి కుటుంబ సభ్యులు శఽనివారం రాత్రి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, సర్పంచ్ కూచి నర్సయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
లేజర్ ఎన్యుక్లియేషన్, అడ్వాన్స్‌డ్ ప్రొస్టేట్ సర్జరీలపై శిక్షణ
పటమట(విజయవాడతూర్పు): ప్రశాంత్ హాస్పిటల్ 37వ వార్షికోత్సవం సందర్భంగా లేజర్ ఎన్యుక్లియేషన్ అండ్ అడ్వాన్స్‌డ్ ప్రొస్టేట్ సర్జరీ ప్రోగ్రామ్(లీప్)ను అత్యాధునిక ప్రొస్టేట్ సర్జరీలు, వైద్య చికిత్సల నిర్వహణపై వైద్యులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. లబ్బీపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానంగా.. అడ్వాన్స్‌డ్ లేజర్ ఎన్యుక్లియేషన్ ప్రొస్టేట్ చికిత్స గురించి, లైవ్ సర్జరీలు, చికిత్సలో మెలకువలు, యూరాలజిస్టులకు ప్రయోగాత్మక శిక్షణ అందించారు.
వాటితో పాటు రెజుమ్ వాటర్ వేపర్ థెరపీ వంటి సూక్ష్మ విధాన శస్త్రచికిత్సలు, యూరోలిఫ్ట్, రోబోటిక్ సింపుల్ ప్రొస్టటెక్టమీ, ఐటిండ్ తదితర చికిత్స విధానాలపై శిక్షణనందించారు. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ధీరజ్ కాసరనేని, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.

లేజర్ ఎన్యుక్లియేషన్, అడ్వాన్స్‌డ్ ప్రొస్టేట్ సర్జరీలపై శిక్షణ