
విశ్రాంత ఉద్యోగుల జీవన రాజధాని విజయవాడ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత జీవితం అధికంగా విజయవాడతోనే ముడిపడి వుంటుందని సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ అతీరా ఎస్.కుమార్ అన్నారు. ఆటోనగర్ లోని ఒక ఫంక్షన్ హాలులో గురువారం జీఎస్టీ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సభ జరిగింది. ఈ సందర్భంగా అతీరా ఎస్.కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ జీవితంలో ఎన్ని ప్రాంతాలు మారినా, చివరకు విశ్రాంత ఉద్యోగిగా విజయవాడలోనే అధికంగా స్థిరపడుతున్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల నివాస కేంద్రంగా విజయవాడ మారిందన్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తన ఉద్యోగ జీవితంలో శాఖ అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. అనంతరం శ్రీనివాసరావును అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.
సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్
అతీరా ఎస్.కుమార్