
రైతుల సమక్షంలోనే రీసర్వే
జేసీ ఇలక్కియ
జి.కొండూరు: భూములు రీసర్వే సమాచారాన్ని ముందుగానే తెలియజేసి, సర్వేకు సంబంధిత రైతు తప్పక హాజరయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఆదేశించారు. భూముల రీ సర్వేలో భాగంగా జి.కొండూరు మండల పరిధి చెవుటూరు, వెంకటాపురం గ్రామాల మధ్య గ్రామసరిహద్దులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీ సర్వే సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జి.కొండూరు శివారులో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించారు. జేసీ వెంట తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు దాతలు విరాళాలను అందజేశారు. రాజమండ్రికి చెందిన ఎం.ప్రేమ్‌కుమార్ ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116ల విరాళాన్ని అందజేశారు. విజయవాడ పటమటకు చెందిన ఎం.వెంకటలక్ష్మి పేరిట కుమారుడు శ్రీనివాస్, లలిత దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు, దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.
సీనియర్ డీసీఎంగా
ప్రశాంత్‌కుమార్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం (డివిజనల్ కమర్షియల్ మేనేజర్)గా బి.ప్రశాంత్‌కుమార్ శక్రవారం బాధతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు విజయవాడ డివిజన్‌లోనే సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఆస్థానంలో ప్రశాంత్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు.
ఐవీఎఫ్ సెంటర్ తనిఖీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతాన సాఫల్య కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వైద్యసేవలు అందిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని హెచ్చరించారు. ఆమె శుక్రవారం నగరంలోని ఒయాసిస్ ఐవీఎఫ్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. సెంటర్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, అనుమతులు, పరికరాలను పరిశీలించారు. ఈసందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని ఐవీఎఫ్ కేంద్రాలు, ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత షోకాజ్ నోటీసు జారీచేసి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ఏఆర్‌టీ సెంటర్లు, ఆస్పత్రులు తప్పనిసరిగా విధి విధానాలు పాటించాలని ఆమె సూచించారు. తనిఖీల్లో ఎన్‌హెచ్‌ఎం డీపీఎం డాక్టర్ నవీన్ కూడా పాల్గొన్నారు.
మొసళ్లున్నాయ్ జాగ్రత్త!
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో భయంకరమైన మొసళ్లు ఉన్నాయ్, నదిలోకి దిగి ప్రాణాలు పోగొట్టుకోవద్దని శనైశ్వర స్వామి దేవస్థానం వద్ద కృష్ణలంక పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహంలో వచ్చిన మొసళ్లు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిలో తిరుగుతున్నాయని, ఇప్పటికే ఈ ప్రాంతంలో సరదాగా ఈతకు దిగి పలువురు యువకులు మృతి చెందారంటూ ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

రైతుల సమక్షంలోనే రీసర్వే

రైతుల సమక్షంలోనే రీసర్వే

రైతుల సమక్షంలోనే రీసర్వే

రైతుల సమక్షంలోనే రీసర్వే