
బిరబిరా కృష్ణమ్మ
విజయవాడ కంట్రోల్ రూం నంబర్: 9154970454
కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి 65వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇది క్రమేపీ 3లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. వరద నీరు బుధవారం మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి వరద నేపథ్యంలో పరీవాహక ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
– గాంధీనగర్(విజయవాడసెంట్రల్)
● పులిచింతల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 65వేల క్యూసెక్కులు విడుదల
● ప్రకాశం బ్యారేజ్‌కు వరద హెచ్చరిక