
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ అభివృద్ధి పనులకు, నిత్యాన్నదానానికి సోమవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. శ్రీ షిర్డీ సాయి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్, వసంత దంపతులు తమ కుమార్తె సహన, కుటుంబ సభ్యుల పేరిట రూ. 2 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. అదే విధంగా మచిలీపట్నంకు చెందిన సర్వలలిత కుటుంబం ఆలయ అభివృద్ధి పనులకు రూ. 2 లక్షలు, నిత్యాన్నదానానికి రూ. 2 లక్షల విరాళాన్ని ఈవో శీనానాయక్‌కు అందజేశారు. అలాగే విజయవాడకు చెందిన అట్లూరి రామచంద్రం, విజయలక్ష్మి దంపతుల సంతానమైన శ్రీరామ్, సుహాస్, పూజితల పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఈవో శీనానాయక్, ఇతర అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో బహూకరించారు.
విజయవాడ డీఆర్‌ఎంగా
మోహిత్ సోనాకియా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డీఆర్‌ఎంగా మోహిత్ సోనాకియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1995, 1997లో ఐఐటీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, అనంతరం మాస్టర్ డిగ్రి పొందిన ఆయన 1998లో ఉత్తర రైల్వేలోని ఘజియాబాద్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా భారతీయ రైల్వే సర్వీసులో చేరారు. ఈ కొత్త నియామకానికి ముందు ఆయన రైల్ వీల్ ఫ్యాక్టరీలో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ (పీసీఈఈ)గా విధులు నిర్వర్తించారు. భారతీయ రైల్వేలో ఆయనకు 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఏపీఎంఆర్‌సీలో కాన్పూర్ మెట్రో ప్రియారిటీ కారిడార్‌ను ప్రారంభించడంలో, నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని వారణాసి డివిజన్‌లో ఛప్రా–గోరఖ్‌పూర్ విభాగంలో విద్యుదీకరణ ప్రాజెక్ట్‌లలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

దుర్గమ్మకు పలువురు విరాళాలు