
అర్జీల పరిష్కారంలో స్పష్టత ఉండాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో పూర్తి స్పష్టత ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ీపీజీఆర్‌ఎస్) జరిగింది. కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో 192 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 192 అర్జీలు అందాయన్నారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 60, విద్య 34, పోలీస్ శాఖకు 17, ఎంఏయూడీ 12, అటవీ 10, పంచాయతీరాజ్ 9, సర్వే 8, పౌరసరఫరాలు 7, హెల్త్ 6,బీసీ కార్పొరేషన్ 3, ఉపాధి కల్పన 3, మార్కెటింగ్ 3, ఏపీసీపీడీసీఎల్ 2, డీఆర్‌డీఏ 2, మత్స్య 2, ఇంటర్మీడియెట్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, వ్యవసాయం, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌డబ్య్లుఆర్‌ఇఐఎస్, విభిన్న ప్రతిభావంతులు, డ్వామా, జలవనరులు, ఎల్‌డిఎం, ఆర్‌డబ్ల్యూఎస్, సోషల్ వెల్ఫేర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున అందాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఏసీపీ కె. వెంకటేశ్వరరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ జి.లక్ష్మీశ