
కేర్‌లెస్ హాస్టల్స్!
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యార్థుల హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వందలాది మంది విద్యార్థులు రెండు మూడు బ్లాకుల్లోని హాస్టళ్లలో ఉంటారు. వీటిలో వసతులు, సౌకర్యాలు, భోజనం వంటి పర్యవేక్షణ సరిగా లేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కొన్నేళ్లుగా అనధికారికంగా ఒక ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అతనే విద్యార్థుల నుంచి మెస్ చార్జీలను సైతం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే హాస్టల్‌లో ఏదైనా సమస్య వస్తే ఆ వ్యక్తి అందుబాటులో ఉండరని, అతను ఏలూరులో నివాసం ఉంటున్నట్లు వైద్య కళాశాల ఉద్యోగులే చెబుతున్నారు. అంతేకాదు హాస్టల్స్ అనేక లోపాలు ఉన్నట్లు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలలో శాశ్వత ఉద్యోగి కాని వ్యక్తి విద్యార్థుల నుంచి మెస్ చార్జీలు ఎలా వసూలు చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై లోతుగా విచారిస్తే అనేక అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. నెల రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
మొత్తం 850 మందిపైనే..
వైద్య కళాశాల హాస్టల్స్‌లో సుమారు 850 మందికిపైగా విద్యార్థులు ఉంటున్నారు. వారిలో 650 మంది యూజీ విద్యార్థులు, వారిలో 350 మంది గరల్స్, 300 మంది బాయ్స్ ఉన్నారు. మరో 200 మంది వరకూ పీజీ విద్యార్థులు ఉంటారు. ఇలా మొత్తం 800 మందికి పైగానే హాస్టల్స్‌లో ఉంటున్నారు. వీరిలో యూజీ విద్యార్థులు ఏడాదికి రూ.19 వేలు చెల్లిస్తుంటారు. పీజీ విద్యార్థులు నెలకు రూ.4వేలు చెల్లిస్తారు. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తి వసూళ్లు చేసి, హాస్టల్ కమిటీ అకౌంట్‌లో జమ చేస్తుంటారు. మళ్లీ వాటి నుంచి ఖర్చు రూపేణా ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ప్రైవేటు వ్యక్తులతో నిర్వహణ!
వైద్య విద్యార్థుల హాస్టల్స్ నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారు. కేర్‌టేకర్‌తో పాటు, మరో 16 మంది ఉన్నారు. వారంతా విద్యార్థులు చెల్లించే మెస్‌చార్జీల్లోనే జీతాలు పొందుతున్నారు. కమిటీ, వార్డెన్ ఉన్నా నామమాత్రమేనని చెబుతున్నారు. హాస్టల్‌లో ఏదైనా కొనాలన్నా, పనులు చేయించాలన్నా అతనే కొటేషన్ తీసుకొచ్చి చేయిస్తుంటాడని చెబుతున్నారు. ఇలా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. వాస్తవానికి సెక్యూరిటీ, శానిటేషన్ పనులు చేసేందుకు కళాశాలలో కాంట్రాక్టు సంస్థ ఉంది. వారే ఇక్కడ కూడా విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇస్తే, విద్యార్థుల నుంచి వసూలు చేసే మెస్‌చార్జీల్లో జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉండదని పలువురు అంటున్నారు. కేర్‌టేకర్‌గా ఉన్న వ్యక్తిని తొలగించాలని స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పటి నుంచో చెబుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. అతని అక్రమాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయంటున్నారు. ఇప్పటికై నా స్పందించి హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలంటున్నారు.
సౌకర్యాలు అంతంత మాత్రమే
వైద్య విద్యార్థుల భద్రత ఏదీ!
హాస్టల్స్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తి చేతుల్లో..
ఉండేది ఏలూరులో
విద్యార్థుల నుంచి మెస్ చార్జీల వసూళ్లు చేసేది ఆయనే
వార్డెన్, కమిటీ ఉన్నా..
పెత్తనం అంతా ఆ వ్యక్తిదే..
కొత్త ప్రిన్సిపాల్ దృష్టి సారించేనా?
చర్యలు తీసుకుంటాం
వైద్య విద్యార్థుల హాస్టల్స్ నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించాను. రెండు సార్లు హాస్టల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి, సమస్యలు తెలుసుకున్నా. అంతేకాకుండా ఇటీవల హాస్టల్స్ కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. విద్యార్థుల మెస్ చార్జీల వసూలు, కార్యాలయ ఉద్యోగికి అప్పగిస్తాం. అంతేకాకుండా హాస్టల్స్ నిర్వాహణను మెరుగుపర్చే చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల
ఈ హాస్టల్స్‌లో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సరైన తాగునీటి వసతి లేక పోవడం, డైనింగ్‌హాల్‌లో అపరిశుభ్ర వాతావరణం, టాయిలెట్స్ సరిగా శుభ్రపరచకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కొన్ని గదుల కిటికీలకు తలుపులు ఊడిపోయేలా ఉండటం, ఫ్లోరింగ్ సరిగా లేక పోవడం వంటివి ఉన్నాయి. వాటన్నింటిపై అధికారులు దృష్టి పెట్టాలంటున్నారు. భవనాల మరమ్మతులు కూడా నోచుకోవడం లేదంటున్నారు. వాటిపై దృష్టి పెట్టాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.

కేర్‌లెస్ హాస్టల్స్!