
దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరిగాయి. సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించే సూర్య భగవానుడిని ఆరాధించడంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు వృద్ధి చెందుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్‌లో అమ్మవారి దర్శనం చేయించారు.