
తైక్వాండోలో బంగారు పతకం
ఆటోనగర్(విజయవాడతూర్పు): విజయవాడ గాయత్రీనగర్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని వి.డిలిష్యారాజ్ 55 కేజీల ఫ్రెషర్స్ క్యాడెట్ ఫిమేల్ విభాగం తైక్వాండోలో సత్తాచాటింది. బంగారు పతకంతో పాటు మరొక సిల్వర్ పతకం సాధించింది. రెండు కేటగిరీల్లో రెండు పతకాలు సాధించింది. విజయవాడలో 10 వ జాతీయ తైక్వాండో చాంపియన్ పోటీలు మూడు రోజులుగా జరుగుతున్నాయి. ఇందు లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన తైక్వాండో పోటీల్లో డిలిష్యారాజ్ రెండు పతకాలు సాధించింది.
బుల్లెట్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన దొప్పలపూడి హనుమానా శాస్త్రి, దండా గోపి, మరొక వ్యక్తి కలిసి బుల్లెట్‌పై చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు ఆదివారం వెళ్తున్నారు. తిమ్మాపురం వంతెనపై మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం కూడా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనంపై కూర్చున్న వారిలో మధ్యలో ఉన్న వ్యక్తి బుల్లెట్ హ్యాండిల్ పట్టుకున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.