
సందడిగా కేఎల్‌యూ నూతన విద్యార్థుల సమ్మేళనం
తాడేపల్లి రూరల్: ఇంజినీరింగ్ అనేది ఒక మహాద్భుతమని.. ఎన్నెన్నో ఆవిష్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని కేఎల్‌యూ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ అన్నారు. ఆదివారం తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కోర్స్ తీసుకున్న విద్యార్థుల సమ్మేళన అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి వర్మ మూడు దశాబ్దాలుగా ఇంజినీరింగ్ రంగంలో గణనీయంగా వచ్చిన ప్రగతిని గురించి వివరించారు. ఇంజినీరింగ్ కోర్సులు, వాటిలో ప్రత్యేకతలు, విద్యార్థులు ఎలా ప్రణాళికా బద్ధంగా నేర్చుకోవాలి.. నైపుణ్యాలు ఎలా సాధించాలో తెలియజేశారు. యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రుల ఆశయాల సాధనతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యం చాలా అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో వీసీ డాక్టర్ కె.రాజశేఖరరావు, డీన్స్ డాక్టర్ శ్రీనాద్, కృష్ణారెడ్డి, కేఆర్‌ఎస్ ప్రసాద్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.