
జీతాల సమస్య పరిష్కరించాలి : యూటీఎఫ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీతాల సమస్యను తక్షణం పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగి 45 రోజులు కావస్తున్నా వారి జీతాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద శనివారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నక్కా వెంకటేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బది లీలు జరిగి 45 రోజులు గడిచినా కేడర్ స్ట్రెంత్ వివరాలు కిందికి పంపక పోవడం, పొజిషన్ ఐడీలు లేక పోవ డంతో జాన్, జూలై నెలల జీతాలు డీడీఓలు చేయడానికి ఆటంకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 25 వేల మందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్‌కుమార్ మాట్లాడుతూ.. హైస్కూల్ ప్లస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, నాయకులు ఎం.కృష్ణయ్య, పి.లీల, పి.నాగేశ్వరరావు, డి.హరిప్రసాద్, బి.రెడ్‌స్టార్, ఎం.లింగారెడ్డి, జై.సుధానంద్ తదితరులు పాల్గొన్నారు.