
ఇళ్లకు వెళ్లి వస్తున్న దుస్థితి
హాస్టల్స్‌లో వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి వస్తుండటంతో రాత్రి వేళ ఆయా హాస్టల్స్‌కు వార్డెన్ తాళాలు వేస్తున్నారు. నందిగామ ఎస్సీ హాస్టల్‌లో తలుపులు విరిగిపోయాయి. కంచికచర్ల మండలం గండేపల్లి ఎస్సీ బాలికల హాస్టల్‌లో రాత్రి సమయంలో విద్యార్థులు ఉండటం లేదు. వీరంతా గ్రామానికి చెందిన విద్యార్థులు. దీంతో వారంతా ఇళ్లకు వెళ్లి తిరిగి మరుసటి రోజు హాస్టల్‌కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా వార్డెన్ కూడా అప్పుడప్పుడు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విధమైన దుస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.