
యానిమేషన్ స్కాంలో రూ. కోట్లు పోతున్నా ఫిర్యాదుకు వెనకడ
న్యాయపరంగా నిలుస్తాయా..?
ఎటువంటి ఆధారాలులేని పత్రాలను పట్టుకొని ఏ కోర్టు మెట్లు ఎక్కినా ఉపయోగం లేదన్న భావన బాధితుల్లో నెలకొంది. దీంతో పాటు లెక్కల్లో చూపని బ్లాక్‌మనీ అధిక మొత్తంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకడుగు వేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినవారికి ఒత్తిళ్లు అధికమయ్యాయి. యానిమేషన్‌లో పెట్టిన డబ్బులు తిరిగిరావని భావించిన బాధితులు ఉన్న ఆస్తులను అమ్మి తెచ్చిన అప్పులను తీర్చే పనిలో ఉన్నారు. మరికొంత మంది ఉన్న ఆస్తుల కంటే అప్పులు అధికంగా ఉండటంతో ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.