ఆకట్టుకున్న ఆవుల అందాల పోటీలు
గన్నవరం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఆవుల అందాల పోటీలను నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి ఆవులను తీసుకువచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన పశువులకు సంబంధించిన యాజమానులకు 6.50 లక్షల నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. పోటీల నిర్వాహకులు కాసరనేని రాజా, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం ఇన్‌చార్జ్ సర్పంచ్ పాలడుగు నాని, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ పాల్గొన్నారు. ఒంగోలు జాతి ఆరు పళ్ల విభాగంలో కంకిపాడుకు చెందిన వట్టి కృష్ణయ్య ఆవులు ద్వితీయ స్థానం, నాలుగు పళ్ల విభాగంలో పమిడిగుంటపాలెంకు చెందిన మైనేని వంశీకృష్ణ మొదటి స్థానం, ఒంగోలు జాతి రెండు పళ్ల విభాగంలో పెనమలూరుకు చెందిన కిలారు వెంకటేశ్వరరావు ఆవులు మొదటి స్థానంలో నిలిచాయి,
ఆత్మీయ కలయికలతో అసమానతలు లేని సమాజం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): అసమానతలు లేని సమాజం కోసం ఇలాంటి ఆత్మీయ కలయికలు తరచూ జరగాలని సమతా పార్టీ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు అన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సంక్రాంతి ఆత్మీయ కలయిక ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా గత 10 సంవత్సరాలుగా ఈ ఆత్మీయ కలయికను నిర్వహిస్తున్నానన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజల పరం కావాలని, అసమానతలు లేని సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కృష్ణారావు ఆకాంక్షించారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తూ రాష్ట్రాలపై బలవంతంగా రద్దుతోందన్నారు. ఆత్మీయ కలయికలో ఎమ్మెల్సీ బి.టి.నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీస్ విశ్రాంత అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ, సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ, బీజేపీ నాయకుడు లక్ష్మీపతి రాజా, జీఎస్టీ(ఆడిట్) కమిషనర్ ఆనంద్, ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్‌కుమార్, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, హైకోర్టు న్యాయవాది రవితేజ, మాదిగ దండోరా నాయకుడు కృపాకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆవుల అందాల పోటీలు


