లివర్ జరభద్రం
లివర్ వ్యాధులకు కారణాలివే..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా కాలేయాన్ని కాటేసే సిరోసిస్‌పై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. ఇటీవల కాలంలో కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారు అధికంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అందుకు మధుమేహం, కొన్ని రకాల మందులు వాడకం, హెపటైటీస్, ఒబెసిటీ, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్ సేవనం కారణమంటున్నారు. ఫ్యాటీ లివర్‌ను అశ్రద్ధ చేస్తే సిరోసిస్‌కు దారి తీస్తుందని, క్రమేణా క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కాహాల్ సేవించే వారితో పాటు ఆల్కాహాల్ సేవించని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవే నిదర్శనం..
● నున్నకు చెందిన రాజేష్ తరచూ ఆల్కాహాల్ సేవిస్తుంటారు. ఇటీవల తరచూ తీవ్రమైన కడుపునొప్పి, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యతో ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి స్కాన్ చేయగా లివర్ సిర్రోసిస్‌గా గుర్తించారు.
● కంచికచర్లకు చెందిన వెంకట్ తరచూ నాన్‌వెజ్ తింటుంటాడు. అతనికి ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో పాటు వాంతులు కూడా అవుతుండటంతో ఆస్పత్రికి వచ్చాడు. అతనికి స్కాన్‌లో గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్‌తో పాటు ఫ్యాటీ లివర్ థర్డ్ స్టేజ్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా నిత్యం చేస్తున్న అబ్డామిన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లలో ఫ్యాటీలివర్ ఉన్న వారు ఎక్కువగా ఉంటున్నారు.
ఆస్పత్రులకు క్యూ...
లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో అల్సర్స్, అరుగుదల ఇబ్బందులతో పాటు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. హెపటైటీస్ బీ, సీ కేసులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో సిరోసిస్ కేసులు ఎక్కువగా చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీలివర్ కేసులు పదుల సంఖ్యలో ఉంటున్నాయని వారు అంటున్నారు. నాన్ ఆల్కహాలిస్టుల్లో ఫ్యాటీ లివర్ సిరోసిస్‌కు దారితీస్తే ప్రాణాంతకం కావచ్చు.
వీరు అప్రమత్తంగా ఉండాలి..
లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్ ఉన్న వారు, హెపటైటీస్ సీ, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలు అబ్‌నార్మల్ ఉన్న వారిలో వస్తున్నాయి. ఫ్యాటీలివర్ కామన్‌గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అదికాస్త సిరోసిస్‌కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీలివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చునని, కానీ సిరోసిస్‌కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని వైద్యులు అంటున్నారు. లివర్ ఫంక్షన్‌లో తేడా వస్తుందని, ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని వారు అంటున్నారు.
ముందు జాగ్రత్త మేలు..
శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న జంక్‌ఫుడ్స్‌ను తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్‌పై ప్రభావం చూపుతున్నాయి. 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలస్ట్రాల్ లెవల్స్, థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్ పనితీరును ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రోస్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలను వైద్యులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు
అశ్రద్ధ చేస్తే క్యాన్సర్‌కు
దారి తీస్తున్న వైనం
ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయరాదు
రెగ్యులర్‌గా స్క్రీనింగ్ తప్పనిసరి
అంటున్న వైద్యులు
శ్రమలేని జీవన విధానం
ఆహారపు అలవాట్లు
పెరుగుతున్న మధుమేహులు
ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం
ఆల్కహాల్ సేవనం


