స్క్రీనింగ్ తప్పనిసరి..
లివర్ వ్యాధులకు ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. కొందరిలో సాధారణంగా జ్వరం, కామెర్లు, నీరసం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. మధుమేహులు, ఆల్కహాల్ సేవించే వారు, ఒబెసిటీ ఉన్న వారు, హెపటైటీస్ వైరస్లు ఉన్న వారు ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రోస్కాన్ అందుబాటులోకి వచ్చింది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి.
– డాక్టర్ చింతా వీర అభినవ్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్
●


