యనమలకుదురు లంకల్లో మహిళ మృతదేహం లభ్యం
పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధి కృష్ణానది లంకల్లో శనివారం రక్తం గాయాలతో మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు ఎస్‌ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు లంకల్లో గుర్తు తెలియని మహిళ(55) మృత దేహం ఉండటంతో గ్రామస్తులు తెలిపిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. రెండు రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె ముఖం, ఒంటిపై రక్తం గాయాలున్నాయి. మృతదేహం వద్ద ఎటువంటి వివరాలు, క్లూ లభించలే దు. మృతి చెందిన మహిళ యనమలకు దురు గ్రామానికి దూ రంగా కృష్ణానది లంకల్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుందో విచారిస్తున్నా రు. ఆమెది హత్యా లే క సహజంగానే మరణించిందా అనేకోణంలో దర్యాప్తు చేపట్టారు. పోలీసులుఆమె మృత దేహా న్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కనకదుర్గ వారధిపై ప్రమాదం
తాడేపల్లి రూరల్ : కృష్ణానది కనకదుర్గ వారధిపై శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న బొలేరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో వారధి 16వ పిల్లర్ వద్ద టైరు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం ఒక్కసారిగా రిటైనింగ్ వాల్‌కు ఢీకొనడంతో వాల్ పూర్తిగా ధ్వంసమైంది. ఫుల్‌రెస్ట్‌పై బొలెరో వాహనం ఆగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయ రహదారి భద్రతా సిబ్బంది, తాడేపల్లి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
యనమలకుదురు లంకల్లో మహిళ మృతదేహం లభ్యం
యనమలకుదురు లంకల్లో మహిళ మృతదేహం లభ్యం
యనమలకుదురు లంకల్లో మహిళ మృతదేహం లభ్యం


