అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ ఆశయాలకు కూటమి తూట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేద వారికి చేరాయని, వారు ఉన్నతంగా ఎదిగేందుకు తోడ్పడ్డాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తోందని, సంక్షేమ పథకాలు లేవు, విద్యార్థులకు చదువు లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తుందన్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..
రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, 10 నెలల్లో ప్రజల మీద దందాలు తప్పా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్‌ల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, అనుబంధ విభాగాల అధ్యక్షులు చందా కిరణ్‌తేజ, శెటికం దుర్గాప్రసాద్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్


