
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.
‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
చైర్‌పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్‌లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు.
ప్రత్యేక ఆకర్షణలు
NFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
వాలంటీర్ల దృక్పదం
స్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్‌లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.
ఆడియన్స్ అభిప్రాయాలు
మహిళల క్యాన్సర్‌లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.

హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు
హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment