లండన్‌లో ఘనంగా "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు"

Telangana State formation Day Celebrations in London - Sakshi

లండన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఎన్నారై తెరాస,  టాక్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కార్యవర్గ కుటుంబసభ్యులతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు.

లండన్: ఎన్నారై తెరాస,  టాక్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కార్యవర్గ కుటుంబసభ్యులతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడుగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకున్నారు. కెసిఆర్ గారి నాయకత్వంలోని మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేసారు. అమరుల ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు  తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాబోయే రోజుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. టాక్ సంస్థ చేస్తున్న సంస్కృతిక సేవా కార్య క్రమాల గురించి వివరించారు.

టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గసభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సలహా మండలి చైర్మన్ మట్టా రెడ్డి  తెరాస లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి  పాల్గొన్నారు. ముఖ్య నాయకులు అబూ జాఫర్ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు.

టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుశుమన రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్య చిలుముల, అడ్వైసరి చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ మరియు తెరాస నాయకులు మల్లా రెడ్డి , సురేష్ బుడుగం, సత్యపాల్, శ్రావ్య , సుప్రజ , స్వాతి బుడుగం, రవి రెటినేని, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్, అబూ జాఫర్,సృజన్ రెడ్డి,ప్రశాంత్,సురేష్ గోపతి, హరి నవాపేట్, మణి తేజ, నిఖిల్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top