నిరాడంబరంగా "టాక్ లండన్ బోనాల జాతర"

Telangana Association Of Uk Celebrates Bonalu Festival In London - Sakshi

లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌ ( టాక్) ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర జరిగింది. లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాక్‌ అధ్యకక్షులు రత్నాకర్‌ కడుదుల మాట్లాడుతూ.. ప్రతీఏడు వైభవంగా బోనాల జాతరను నిర్వహిస్తామని, ఈ ఏడాది కరోనా నిబంధల్ని పాటిస్తూ అమ్మవారికి బోనాల సమర్పించినట్లు చెప్పారు. 

ప్రపంచ దేశాల్ని కరోనా పట్టిపీడిస్తున్న తరుణంలో విపత్తునుంచి ప్రజల్ని సురక్షితంగా ఉంచాలని కోరుకున్నామని ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి అన్నారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్ని  చర్యలు తీసుకున్నా ప్రజలందరూ స్వీయ క్రమశిక్షణ పాటించాలని టాక్ సంస్థ ప్రతినిథులు విజ్ఞప్తి చేశారు.
 

 ప్రతి సంవత్సరం బోనాల పండగ నాడు బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపుతో పాటు అమ్మ వారికి చేసే పూజలు ముఖ్య ఘట్టమని, అయితే కరోనా కారణంగా టాక్ తరపున ముఖ్య నాయకులు సురేష్ బుడుగం - స్వాతి  దంపతుల ఇంట్లో సంప్రదాయబద్దంగా అమ్మ వారి పూజ నిర్వహించినట్లు వెల్లడించారు.  టాక్ సంస్థ ఆవిర్భావం నుండి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకి టాక్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఇండియా నుండి వచ్చిన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతికి లండన్ లో టాక్  చేస్తున్న సేవలను అభినందించారు.

బోనాల సంబరాలలో  టాక్  అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుష్మునా రెడ్డి, మల్లారెడ్డి,నవీన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,స్వాతి , సుప్రజ,సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ ,హరిగౌడ్ ,గణేష్, రవి రెటినేని,  , రవి పులుసు,మాధవ్ రెడ్డి ,వంశీ వందన్ , భూషణ్, అవినాష్,వంశీ కృష్ణ ,పృథ్వి ,శ్రీ లక్ష్మి, విజిత,క్రాంతి , భరత్ ,వంశీ పొన్నం , చింటూ ,రమ్య , స్వప్న,లాస్య, పూజిత ,బిందు ,మాధవి తదితరులు పాల్గొన్నారు.  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top