సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు

SriRama Navami Vedukalu in Texas - Sakshi

షిరిడి సాయిబాబా దేవస్థానం ఆస్టిన్, వెంకటేశ్వర  దేవస్థానం ఆస్టిన్ (టెక్సాస్‌) ఆధ్వర్యములో అంగరంగ వైభవముగా శ్రీ సీతారామ కళ్యాణం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో  సుమారుగా 6000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగం సాయిబాబాకి  చందన, చావడి ఉత్సవం నిర్వహించగా సీతారాములుకి మంగళ స్నానం చేయించారు. 

సీతారామ కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. వచ్చిన  ప్రతీ భక్తునికి  బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కల్పన నూకవరపు, రవి బురుజులు, మల్లిక్ ఆవుల, కేథార్‌నాధ్‌ ముండ్లురూ, పూర్ణేశ్ సవితాల, విజయ్ దొడ్ల, సౌజన్య , బాలాజీ ఆత్యంలు  ఈ వేడుకులు నిర్వహించడంలో పాలు పంచుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన  దాతలు, వలంటీర్స్‌కు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు. 


 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top