Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం

Saudi Arabia starts issuing and renewing residency permit Iqama quarterly - Sakshi

సౌదీ అరేబియా రెసిడెన్సీ వర్క్‌ పర్మిట్ల విషయంలో కొత్త చట్టం చేసింది. మూడు నెలలకు ఓసారి అక్కడ పని చేస్తున్న కార్మికులకు రెసిడెన్సీ వర్క్‌ పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ అంతర్గత వ్యవహరాలు, మానవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

సౌదీ అరేబియాలో పని చేస్తున్న వలస కార్మికులు నివాసం ఉండేందుకు జారీ చేసే పర్మిట్లను ఇకమాగా పేర్కొంటారు. వలస కార్మికులకు పని కల్పించే ఎంప్లాయర్లే ఈ పర్మిట​‍్లకు సంబంధించిన ఫీజులు చెల్లిస్తూంటారు. గతంలో ఏడాదితో పాటు ఆరు నెలలు, తొమ్మిది నెలల కాలానికి ఈ పర్మిట్లు జారీ చేసేవారు. అయితే ఇక్మాల జారీని మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కనీస కాలపరిమితి మూడు నెలలకు తీసుకువచ్చారు.  అయితే ఇళ్లలో పని చేస్తున్న కార్మికులు కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. 

ఇక్మా రెన్యువల్‌ చేసుకునేవారు అబ్‌షేర్‌ ఇండివిడ్యువల్‌, అబ్‌షేర్‌ బిజినెస్‌, ముఖీమ్‌, కివా వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫార్మ్స్‌లను ఉపయోగించుకోవచ్చు. స్వల్పకాలానికి సంబంధించిన పనులకు వలస కార్మికులను రప్పించుకునే విషయంలో కొత్త నిబంధనల వల్ల ఎంప్లాయర్లకు తక్కువ భారం పడుతుందని సౌదీ ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగానికి ఎంతో ఊతం లభిస్తుందని పేర్కొంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top