న్యూజెర్సీలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Sai Datta Peetham Conducted Special Vaccination Drive In New Jersey - Sakshi

న్యూజెర్సీలో సాయి దత్త పీఠం  వుడ్ లేన్ ఫార్మసీ తో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ నిర్వహించిందిది. న్యూజెర్సీలోని వుడ్ లేన్ ఫార్మసీ (ఓల్డ్ బ్రిడ్జి) దగ్గర జరిగిన ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్  అందించారు. కోవిడ్ రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్‌ ఇచ్చారు. అమెరికాలో మన వాళ్ళు కోవిడ్  బారిన పడకుండా ఉండేందుకు సాయి దత్త పీఠం ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. 

ప్రశంసలు
ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో దాదాపు 250 మందికి పైగా తెలుగువారు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ సెనేట్, అసెంబ్లీ తరఫున స్టెర్లే ఎస్‌ స్టాన్లీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో స్థానిక సాయిదత్త పీఠం, వుడ్ లేన్ ఫార్మసీ, ఓల్డ్ బ్రిడ్జి న్యూజెర్సీలు చేపట్టిన కమ్యూనిటీ సేవాదృక్పధాన్ని కొనియాడారు. ప్రశంసా పత్రాన్ని అందించారు. 

కృతజ్ఞతలు
ఈ వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న ఫార్మసిస్ట్ రవి, డాక్టర్‌ విజయ నిమ్మ, డాక్టర్‌ ప్రసాద్ సుధాన్షు, నర్సులు శిరు పటేల్, సలోని గజ్జర్‌లతో పాటు వాలంటీర్లు గీతావాణి గొడవర్తి, మృదుల భల్లా, అంజలిబుటాలా, రావు ఎలమంచిలి, వికాస్, అన్షు, పల్లవి వీరికి సహాకరించిన పాటు ఇషిత్ గాంధీ, కిరణ్ తవ్వాలకు సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, బోర్డు సభ్యులు వెంకట్ మంత్రిప్రగడ, దాము గేదెల, మురళీ మేడిచెర్ల, సుభద్ర పాటిబండ్ల, వంశీ గరుడలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ పబ్లిక్యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల సహకారం అందించారు. 

 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top