హజ్ యాత్రకు అదనపు సాయం: సీఎం జగన్‌కు ఎన్ఆర్ఐల కృతజ్ఞతలు

NRIs are thankful to Jagan Mohan Reddy for extra help for the Hajj yatra - Sakshi

పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు అదనపు భారం పడకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయం అందిస్తూ ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు  తెలిపారు. గురువారం దుబాయ్‌లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.

హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్గేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 80 వేల అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇతర అధికారులను తనతో పాటు ఎంపీ మిధున్ రెడ్డి కలిశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు.

అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే స్పందించిన  సీఎం జగన్‌ ముస్లిమ్ సోదరులపై అదనపు భారం పడకుండా 80 వేల రూపాయల  సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రూ. 14.15 కోట్లు విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి సీఎం రుజువు చేశారన్నారు. ఈ సమావేశంలో డా. భూ అబ్దుల్లా, కడప యువజన విభాగ అధ్యక్షులు షేక్ ఉమైర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top