న్యూయార్క్ టైమ్స్‌ స్వ్కేర్‌ రామ మయం! | Sakshi
Sakshi News home page

న్యూయార్క్ టైమ్స్‌ స్వ్కేర్‌ రామ మయం

Published Tue, Jan 23 2024 3:09 PM

New Yorks Times Square illuminates with Lord Rams photo - Sakshi

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాసులు భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టైమ్స్‌ స్క్వేర్‌‌లోని బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు.

ఇక భారీ స్కీన్‌ను ఏర్పాటు చేసిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతానికి ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం.

(చదవండి: మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు)

Advertisement
 
Advertisement