Mrs Asia Usa 2023: టైటిల్‌ విన్నర్‌గా సరోజా అల్లూరి

Mrs Asia Usa 2023 tittle won by Saroja Alluri from Vizag - Sakshi

Mrs.ASIA USA 2023  విజేతగా  నిలిచి కిరీటాన్ని అందుకున్నారు వైజాగ్‌కు చెందిన  సరోజా అల్లూరి.  అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక, పోటీ టైటిల్‌  గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళగా నిలిచారు  సరోజ. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’ , ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డులు’. మిస్ అండ్ మిసెస్ ఏషియా  యూఎస్‌ఏ అంతర్జాతీయ పోటీ గ్రాండ్ ఫినాలే నవంబర్ 19న రెడోండో పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్‌లో, రెడోండో బీచ్, కాలిఫోర్నియాలో విర్జెలియా ప్రొడక్షన్స్ ఇంక్ సంస్థ వారి 34వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించారు.

ఫైనల్‌కు ముందు జరిగిన వివిధ రౌండ్‌లలో పోటీ పడిన సరోజా తన విభాగంలో గ్రాండ్ ఫినాలేలో ‘నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్’,  ఈవెనింగ్ గౌన్ రౌండ్’ అనే రెండు పోటీ రౌండ్‌లలో అత్యధిక స్కోర్ చేసారు. జపాన్, ఫిలిప్పీన్స్, చైనా, థాయ్‌లాండ్, మంగోలియా, ఇండోనేషియా మొదలైన దేశాలకు చెందిన  ప్రతినిధులతో  పోటీ పడి  ఈ  టైటిల్‌ను దక్కించుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌, వైజాగ్‌లో పుట్టి పెరిగిన  సరోజా అల్లూరి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. ఆమె ప్రస్తుతం AT&Tలో ITలో టెక్నాలజీ లీడర్‌గా పని చేస్తున్నారు. భర్తతో కలిసి లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న సరోజకు  7 సంవత్సరాల కుమారుడు,  రెండేళ్ల  కుమార్తె  ఉన్నారు.  సరోజ  మంచి డ్యాన్సర్‌,  ఫ్యాషన్ డిజైనర్, వ్యవస్థాపకురాలు, పరోపకారి , ప్రభావశీలి  కూడా.  అంతేకాదు  లాభాపేక్ష లేని అనేక  సంస్థల కోసం స్వచ్ఛందంగా  నిధులను సేకరించడం హాబీ. బహుముఖ ప్రజ్ఞాశాలి , 'ఉమెన్ ఇన్ టెక్'లో విలువైన సభ్యురాలిగా  'అడ్మిరబుల్ అచీవర్' అవార్డును అందుకున్నారు సరోజా అల్లూరి.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top