ఆర్య వల్వేకర్‌... మిస్‌ ఇండియా–యూఎస్‌ఏ

Miss India USA 2022 Winner Aarya Walvekar, Saumya Sharma, Sanjana Chekuri Runner up - Sakshi

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ యువతి ఆర్య వల్వేకర్‌(18) మిస్‌ ఇండియా యూఎస్‌ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్‌ఇండియా యూఎస్‌ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు. 


సినిమాల్లోకి రావాలన్నది తన స్వప్నమని ఆర్య వల్వేకర్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘నన్ను నేను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో నటించాలనేది నా చిన్నప్పటి కల’ అని పీటీఐతో ఆమె అన్నారు. 18 ఏళ్ల ఆర్య వల్వేకర్‌.. వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హై స్కూల్‌లో చదువుకున్నారు. మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ హెల్త్‌పై ఆసక్తి కనబరిచే ఆమె పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. యుఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్‌ నేర్పిస్తున్నారు. 


కొత్త ప్రదేశాల పర్యటన, వంట చేయడం, చర్చలు.. తనకు ఇష్టమైన వ్యాపకాలని వెల్లడించారు. యోగా చేయడం తనకు ఇష్టమన్నారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, చెల్లెలితో గడపడంతో పాటు... స్నేహితుల కోసం వంటలు చేస్తుంటానని చెప్పారు. 

ఇక పోటీల విషయానికొస్తే... మిస్‌ ఇండియా–యూఎస్‌ఏతో పాటు మీసెస్‌ ఇండియా, మిస్ టీన్ ఇండియా –యూఎస్‌ఏ కాంపిటేషన్స్‌ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్‌కు చెందిన అక్షి జైన్‌ మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్‌ మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్‌ఏగా నిలిచారు. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top