విమానం ఎక్కేందుకు రెడీ! 2021లో 4.42 లక్షల పాస్‌పోర్టుల జారీ | Hyderabad passport Office issued 4 lakh 42 thousand passports In 2021 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ రీజనల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌ రికార్డ్‌.. 4.42 లక్షల పాస్‌పోర్టుల జారీ

Jan 5 2022 11:13 AM | Updated on Jan 5 2022 11:16 AM

Hyderabad passport Office issued 4 lakh 42 thousand passports In 2021 - Sakshi

తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉపాధి, ఉన్నత విద్య, తమ కుటుంబ సభ్యులను చూసేందుకు పాస్‌పోర్టు ఆఫీసులకు ప్రజలు పోటెత్తుతున్నారు. 

కరోనా ఎఫెక్ట్‌
కరోనా సంక్షోభం చుట్టుముట్టిన తర్వాత ప్రపంచం ఎక్కడిక్కడ స్థంభించిపోయిందా అనే పరిస్థితులు తలెత్తాయి. విద్యాసంస్థలు మూత పడ్డాయి, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. ఉన్న ఉద్యోగాలే ఊడిపోగా.. చాలా చోట్ల వర్క్‌ ఫ్రం హోం రెగ్యులర్‌ పనిగా మారింది. అయితే వ్యాక్సినేషన్‌ పెరిగిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 

రికార్డు స్థాయిలో
పాస్‌పోర్ట్‌ ప్రాంతీయ కేంద్రం, హైదరాబాద్‌ తాజాగా జారీ చేసిన వివరాల ప్రకారం 2021 ఏడాదిలో 4.42 లక్షల పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. గతేడాది అంటే కరోనా సంక్షోభం బయట పడిన 2020లో ఈ సంఖ్య కేవలం 2.93వేలుగానే ఉంది. కిందటి ఏడాదితో పోల్చితే 2021లో సుమారు లక్షన్నర పాస్‌పోర్టులు అధికంగా జారీ అయ్యాయి. పాస్‌పోర్ట్‌లో కేంద్రాల్లో పరిమితంగానే సేవలు అందించినా భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 

డిమాండ్‌
వ్యాక్సినేషన్‌ మొదలైన తర్వాత క్రమంగా విదేశాల్లో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో కార్మికులు కావాలంటూ కంపెనీలు కబురు పంపుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణాలకు డిమాండ్‌ పెరిగింది. 
 

చదవండి:ఎన్‌ఆర్‌ఐలకు హైదరాబాద్‌ పోలీసుల వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement