న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

Grand Diwali Celebrations Held In Edison New Jersey - Sakshi

భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా నిరంతరం కృషి చేస్తున్న శ్రీ శివ విష్ణు సాయిదత్త పీఠం..   దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నిర్వహించిన దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయ అర్చకులు అత్యంత వైడుకగా, సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలను నిర్వహించారు.

మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.దీపావళి సందర్భంగా బాబాకు ప్రత్యేక హారతులను నివేదించారు. ధనలక్ష్మీ అమ్మవారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి  ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ఆలయంలో  దీపాలు,  విద్యుత్ కాంతులు, రంగోలీలతో సుందరంగా అలంకరించారు. అనంతరం చిన్నా పెద్ద తేడాలేకుండా అందరూ కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఆలయ ప్రధాన  అర్చకులు రఘుశర్మ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే  ఈ ఏడాది కూడా సాయి దత్త పీఠంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకలకు  చక్కటి స్పందన లభించిందని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేసిన భక్తులకు, వాలంటీర్లకు, కమిటీ సభ్యులకు, దాతలకు అర్చకులు  ఆశీర్వచనాలు అందించారు. ఇక ఈ వేడుకలకు గ్రాండ్‌గా జరగటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top