సింగపూర్‌లో రక్తదాన శిబిరం

Blood Donation Camp In Singapore - Sakshi

సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే  సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. 2021 నవంబరు 27, 28 తేదిల్లో స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు ఈ కార్యక్రమం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కరోనా సమయంలో తెలుగు సమాజం వరుసగా ఆరోసారి బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ నిర్వహించడం విశేషం. 

రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 40 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు తెలిపారు. రక్తదానం పట్ల ఆసక్తి ఉన్న ఇతర దాతలు తర్వాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చన్నారు.  సింగపూర్ తెలుగు సమాజనికి, రెడ్‌క్రాస్‌తో పాటు బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top