ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం

Published Wed, Nov 22 2023 5:35 PM

AP American Association AAA Austin Chapter Meet And Greet - Sakshi

అమెరికా, టెక్సాస్‌లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ - ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ఘనంగా ప్రారంబమైంది. ఆంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరై.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ అధ్యక్షుడిగా సత్యేంద్ర వానపల్లిని ఎన్నుకున్నారు. అమెరికాలో వున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ నేషనల్‌ సంస్థ ఏఏఏ అని, ఆంధ్రప్రదేశ్ విశిష్టతను ఆబాల గోపాలానికి సుపరిచయం చేయడమే తమ ముఖ్యోద్దేశమని సంస్థ సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక చక్కని అవగాహన కలిగించే ప్రదర్శనలను చేయడమే తమ ఆశయమన్నారు. సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలు వివరించారు.

ఇంకా సంక్రాంతి సంబరాలతో బాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు హరి మోటుపల్లితో పాటు న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యులు, ఏఏఏ నేషనల్‌ కోర్‌ టీమ్‌, ఆస్టిన్ చాప్టర్ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, పలువురు సంస్థ ప్రతినిధుల పాల్గొని, ప్రసంగించారు. రానున్న రోజుల్లో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి ఈ చాఫ్టర్ మీట్ ఎంతగానో దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. తెలుగు వారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వివరించారు. ఏఏఏసంస్థకు మద్ధతుగా నిలిచి, అండగా ఉంటున్న ప్రతిఒక్కరికి నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!)

Advertisement
 
Advertisement