● రెండు, మూడో స్థానాల్లో నల్లగొండ, నిజామాబాద్
ఖమ్మం స్పోర్ట్స్: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి(ఇంటర్ సర్కిల్) క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ టోర్నీలో వరంగల్ ఆపరేషన్స్ జట్టు ట్రోఫీ కై వసం చేసుకుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీల్లో భాగంగా మంగళవారం కబడ్డీ ఫైనల్స్‌లో వరంగల్ – నల్లగొండ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వరంగల్ జట్టు టైటిల్ దక్కించుకుంది. గత తొమ్మిదేళ్లుగా ట్రోఫీని నల్లగొండ జట్టు దక్కించుకుంటుండగా ఈసారి వరంగల్ విజేతగా నిలిచింది. తృతీయస్థానం కోసం జరిగిన పోటీలో నిజామాబాద్ జట్టు గెలిచింది.
విజేత జట్లకు డీవైఎస్‌వో టీ సునీల్‌రెడ్డి ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ క్రీడల కార్యదర్శి బీ బాబునాయక్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కే క్రిస్టోఫర్‌బాబు, డీఈలు దాస్, ఎం రాధాకృష్ణ, ఎన్ నాగరత్నమ్మ, తుంబూరు దయాకర్‌రెడ్డి, సాంబశివరావు, ఎంఈ కృష్ణారావు, పీవీ అప్పారావు, అశోక్ పాల్గొన్నారు. కాగా, టోర్నీలో భాగంగా టెన్నిస్ పోటీలు చివరి దశకు చేరాయి.


