రుద్రూర్ : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం బస్వాపూర్‌లో రూ.51 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పోచారం గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ఇందిరమ్మ ఇళ్ల ను విడతల వారీగా అందజేస్తున్నామన్నారు. బస్వాపూర్‌లో రూ.5 లక్షలతో నిర్మించిన మహాలక్ష్మి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొ ని ఆలయాన్ని ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, పంచాయతీ ప్రహరీ గోడ, అంగన్‌వాడీ భవనం, బీసీ కమ్యూనిటీ భవనం, మసీదు మరుగుదొడ్లు, ఈద్గా ప్రహరీని ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచ్ పి.శ్రీధర్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఉమ్మడి కోటగిరి మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


