లారీ బోల్తా.. ఆరుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా.. ఆరుగురికి గాయాలు

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

లారీ బోల్తా.. ఆరుగురికి గాయాలు బైక్‌ అదుపు తప్పి ఒకరికి ..

వర్ని: మండలంలోని బడాపహడ్‌ అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి వడ్ల లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడినట్టు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి గురువారం తెలిపారు. పైడిమల్‌ నుంచి వడ్ల లోడ్‌తో వస్తున్న లారీ బడాపహడ్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు హమాలీలు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

నస్రుల్లాబాద్‌: బైక్‌ అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన తుకారాం కుటుంబంతో కలిసి బైక్‌పై నస్రుల్లాబాద్‌ మండలంలో ఉన్న నెమ్లి సాయిబాబా ఆలయానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో బొమ్మన్‌దేవ్‌పల్లి క్రాస్‌ రోడ్డు వద్ద కుక్కలు అడ్డు రావడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయారు. ప్రమాదంలో తుకారానికి గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement