నందిపేట్: నిత్యం మద్యం మత్తులో వేధిస్తున్న భర్తను భార్య ఉరి బిగించి హత్య చేసిన ఘటన నందిపేట్‌లో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన గోసం గంగాధర్(46), సుమలత భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కొంతకాలంగా గంగాధర్ మద్యానికి బానిస కావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తరచూ మద్యం మత్తులో భార్యను కొట్టేవాడు. చివరకు భర్త వేధింపులు తాళలేక భార్య సుమలత అతని మెడకు ఉరి బిగించి హత్య చేసింది. అనంతరం ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు ఎస్సై తెలిపారు.


