● కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో జవహర్ నవోద య విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 28న నిర్వహించే ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కామారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో అధికారులతో పరీక్ష నిర్వహణపై సమీక్షించారు. పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రి న్సిపాల్ ఎం. సీతారాంబాబు పరీక్ష ఏర్పాట్ల ను వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా, పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.


