ముందే మేల్కొనాలి
● గల్ఫ్‌లో అడుగుపెట్టగానే ఆగమాగం
● మత్తు లేకుండా ఉండలేకపోతున్నారు
● ఉన్నట్టుండి అదృశ్యమవుతున్న
వారెందరో..
వలస
జీవితంలో
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బతుకుదెరువు కోసం గ ల్ఫ్ దేశాలకు వెళుతున్న వారిలో కొందరు అక్కడికి చేరుకున్న ఒకటి రెండు రోజులకే ఆగమవుతున్నా రు. వలస కార్మికుల కోసం ఆయా కంపెనీలు ఏర్పా టు చేసిన క్యాంపుల్లో ఉన్నట్టుండి అదృశ్యమవుతున్నారు. అక్కడికి చేరుకున్నానని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తులు ఒకటి రెండు రో జులకే కనబడటం లేదన్న విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి ఎక్కడికి వెళ్లారో వెదకాలని వేడుకోవాల్సి వస్తోంది. వలస వెళ్లిన వా రిలో కొందరు ఆగమవ్వడానికి ప్రధాన కారణం మ త్తు లేకపోవడమేనని స్పష్టమవుతోంది. ఊళ్లో ఉన్న ప్పుడు కల్లు తాగే అలవాటు ఉన్న వారు గల్ఫ్ వెళ్లిన తర్వాత ఆగమవుతున్నారు. క్లోరోఫాం, డైజోఫాం వంటి మత్తు పదార్థాలతో తయారు చేసిన కల్లుకు అలవాటు పడిన వారు చాలా మంది తాగకుండా ఒ క్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. అలాంటి వా రు గల్ఫ్ దేశాలకు వెళ్లడం, అక్కడ తమకు కావాల్సి న మత్తు దొరికే పరిస్థితి లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. అకస్మాత్తుగా మత్తు లేకపోవడంతో శారీరక, మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిని ఆగమాగమై అదృశ్యమవుతున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా నుంచి వలస వెళ్లిన వారిలో కొందరు కల్లు మత్తు లేక తామేం చేస్తున్నామో తెలియని విచి త్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొందరు మత్తు కోసం తెలియని ప్రాంతాల్లో తిరుగుతూ దారి తప్పిపోతుండగా, మరికొందరు మానసిక స్థితి దెబ్బతిని అదృశ్యమవుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలంలో సాగు చే సిన పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితు ల్లో ఉపాధి కరువై చాలామంది గల్ఫ్ బాట పడుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రతి రోజూ వందలాది మంది గల్ఫ్ దేశాలకు వెళు తున్నారు.
మాచారెడ్డి, రామారెడ్డి, కామారెడ్డి, దో మకొండ, సదాశివనగర్, రాజంపేట, భిక్కనూరు, తాడ్వాయి, బీబీపేట, పాల్వంచ, లింగంపేట, సిరికొండ, ఇందల్వాయి, భీమ్‌గల్, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నంది పేట్, మాక్లూర్ తదితర ప్రాంతాల నుంచి వ్యవ సాయ కూలీలు, రైతులు గల్ఫ్ బాట పడుతున్నారు. కరువు నివారణ పేరుతో ప్రభుత్వాలు పెద్దగా చ ర్యలు చేపట్టకపోవడంతో వలసలు తప్పడం లేదు.
మద్యం, కల్లుకు అలవాటుపడి..
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, కూలీ పను లు చేసుకునేవారిలో చాలా మందికి మద్యం, క ల్లు అలవాటు ఉంటుంది. పనులు ముగిసిన త ర్వాత కల్లు సేవిస్తుంటారు. ఈత, తాటి చెట్ల నుంచి వచ్చే కల్లుకన్నా చాలా ప్రాంతాల్లో మత్తు పదార్థాలతో తయారయ్యే కల్లు అమ్మకాలు ఎ క్కువయ్యాయి. ప్రధానంగా డైజోఫాం, క్లోరో ఫాం తదితర మత్తు పదార్థాల మిలితంతో త యారు చేసిన కృత్రిమ కల్లు తాగడం అలవాటైన వారిలో చాలామంది కల్లు లేకుండా ఉండలేకపోతున్నారు.
మద్యం తాగిన తర్వాత కూడా ఎంతో కొంత కల్లు తాగాల్సిందే అన్న భావన చాలా మంది లో పెరిగిపోయింది. అలా అలవాటు ఉన్న వా రు గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులపాలవుతు న్నారు. అక్కడ కల్లు దొరికే పరిస్థితి ఉండదు. దీంతో గల్ఫ్‌లో అడుగుపెట్టిన ఒకటి రెండు రో జులకే ఆగమాగం చేస్తున్నారు.
బంగారు భవిష్యత్తు, కుటుంబ పోషణకు కోసం కన్నవారిని వదిలి ఎడారి బాట పడుతున్న వలస జీవులు కల్లు లేక చిత్తవుతున్నారు. సొంతూళ్లో కల్లుకు అలవాటుపడిన వారు గల్ఫ్ దేశాల్లో కల్లు దొరక్కపోవడంతో క్షణం ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. కొందరు ఉన్నట్టుండి అదృశ్యమవుతుండటంతో కట్టుకున్న, కన్నవారు ఆందోళనకు గురవుతున్నారు.
గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న వారి విషయంలో కుటుంబసభ్యులు అప్రమత్తం కావాలి. వీసా ప్రయత్నాలు మొదలుపెట్టక ముందే నెల, రెండు నెలలపాటు కల్లు అలవాటు మానేసేలా చూడాలి. గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారిలో చాలామంది కల్లు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రవాసీ ప్రజావాణికి వస్తున్న వినతుల్లో తమ వారు అక్కడికి వెళ్లిన ఒకటి రెండు రోజులకే అదృశ్యమయ్యారనే విషయాలు చెబుతున్నారు. అప్పు చేసి విదేశాలకు వెళ్తున్న వారు ముందుగా తమ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
– మంద భీంరెడ్డి, తెలంగాణ ఎన్నారై
అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్


