రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం జాబ్‌ మేళాకు విశేష స్పందన రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రాష్ట్రస్థాయి గోవిజ్ఞాన పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ

సిరికొండ: రాష్ట్రస్థాయి రోల్‌ ప్లే జానపద నృత్య పోటీల్లో సిరికొండలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రతిభ చాటి ద్వితీయ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్‌ గడ్డం రాజేశ్‌రెడ్డి గురువారం తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, జనాభా విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థినులు ప్రతిభ చాటారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటడంపై ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో గురువారం నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి విజేత మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. నెలకు రెండు జాబ్‌ మేళాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి మార్గంలో స్థిరపడాలని పేర్కొన్నారు. ఈ జాబ్‌ మేళాలో 160 మంది ఇంటర్వ్యూలో పాల్గొనగా 62 మంది ఉద్యోగానికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో వరుణ్‌ మోటార్స్‌ కంపెనీ ప్రతినిధులు శివకుమార్‌, అతిక్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: మహిళలు రక్తహీనతకు గురికాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. బాలికలు, మహిళలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాస ప్రసాద్‌, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి సౌందర్య, జిల్లా టీకాల అధికారి అశోక్‌, జిల్లా ఉపవైద్యాధికారులు విద్య, సికిందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: గోసేవ విభాగం తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన గోవిజ్ఞాన రాష్ట్రస్థాయి పరీక్షలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు పెద్ది లోకేశ్‌, జ్యోతి మైత్రేయి, కొక్కుల ప్రీతిక ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చందన, లయన్‌ ఉండవల్లి శివాజీ, గో సేవ ఇందూర్‌ విభాగ్‌ రాజేశ్వర్‌, రాజ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement