అన్ని వర్గాలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసం చేశాయి | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసం చేశాయి

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

● ఎలాంటి కసరత్తు లేకుండా కరువు

మండలాలను ప్రకటించారు

● నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

సుభాష్‌నగర్‌: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను ప్ర స్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంతోపాటు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేశాయని, బీఆర్‌ఎస్‌ అన్ని వ్య వస్థలను సర్వనాశనం చేసిందని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ సంవిధాన్‌ దినోత్సవా న్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. అధికార యంత్రాంగం ఎలాంటి కసరత్తు లేకుండా జిల్లాలో కరువు మండలాలను ప్రతిపాదించారని, గోదావరి తీరం ఉన్న మండలాలను వదిలేసి మిగతా మండలాలు ప్రకటించారని ఆరోపించారు. ఈ సీజన్‌లో క్రాఫ్‌ హాలీడే అంటున్నారని, రైతులకు ఎలాంటి పరిహా రం ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పంట కోతలు ముగిసి నెల రోజులు కావొస్తున్నా.. ఇంతవరకూ ఎక్కడ కూడా గింజ ధాన్యం సేకరించలేదని, ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పత్తా లేకుండా పోయారన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై మాజీ సీఎం కేసీఆర్‌ ఆందోళనలకు సిద్ధమవుతున్నారన్నట్లు వార్తలు వస్తున్నాయని, ఏం మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతాంగంపై చిత్తశుద్ధి లేదని, కొను గోళ్లపై ఒక్క సమీక్ష కూడా చేపట్టలేదని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ను పక్కాగా అమలు చేస్తామని, డీ లిమిటేషన్‌ ప్రక్రియపై త్వరలో డ్రాఫ్ట్‌ బిల్లు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

అనంతరం 2008 నవంబర్‌ 26న ముంబై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ కు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌ నం పాటించారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్య నారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి, నా యకులు, కార్పొరేటర్లు న్యాలం రాజు, ప్రమోద్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, ఓంసింగ్‌, వెల్మ గంగారెడ్డి, పురుషోత్తం, ఎర్రం సుధీర్‌, యాదల నరేశ్‌, ప్రవీణ్‌, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement