కొత్త లైన్లు కష్టమేనా? | - | Sakshi
Sakshi News home page

కొత్త లైన్లు కష్టమేనా?

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

రైల్వే లైన్ల కోసం రాష్ట్ర వాటా నిధుల కేటాయింపుపై నిరాసక్తత

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కీలక జంక్షన్‌గా ఉన్న ఇందూరు ప్రాంతానికి కొత్త రైల్వే లైన్ల కోసం ఏళ్లుగా ఎ దురుచూపులు తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటు చేసే రైల్వే లైన్లకు కేంద్రంతోపాటు రాష్ట్రం సైతం వాటా నిధుల ను జమచేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం నిధు లు సమకూర్చడం లేదు. దీంతో కొత్త రైల్వే లైన్ల ప్ర తిపాదనలను కేంద్రం ఉపసంహరించు కునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా మీ దుగా కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. కీలకమైన రెండు రైల్వే లైన్‌ ప్రా జెక్టులు ఆర్మూర్‌–ఆదిలాబాద్‌తోపాటు బోధన్‌– లాతూర్‌ లైన్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ప్రతిపాదన దశలోనే..

జిల్లాలోని ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌ వరకు కొత్త రైల్వే లైన్‌ వేయాలన్నది ప్రతిపాదనగానే మిగులుతోంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ జిల్లాలను కలిపే ఈ మార్గం ఏర్పాటు ముందుకు సాగడం లేదు. రూ. 4,350 కోట్ల అంచనాతో 136 కి.మీ దూరం రైల్వే మార్గం నిర్మించేందుకు అంచనాలు రూపొందించినా కార్యరూపం దాల్చడం లేదు. ఈ రైల్వే లైన్‌ ఏర్పాటైతే జిల్లా నుంచి ఆదిలాబాద్‌కు రెండున్నర గంటల్లోపు చేరుకునే వీలుంటుంది. బాల్కొండ, బుస్సాపూర్‌, నిర్మల్‌, ఇచ్చోడ పట్టణాలు సైతం కనెక్టివిటీలోకి వస్తాయి. రెండు జిల్లాల నడుమ ప్రయాణ సౌకర్యం పెరుగనుంది. పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపునకు కేంద్రం ముందుకు రాకపోవడం, తమ వాటా నిధుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పందించకపోవడంతో ఈ రైల్వే లైన్ల ప్రతిపాదన రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇందల్వాయి పరిదిలో భూ సేకరణ

మహారాష్ట్రలోని ముద్కేడ్‌ నుంచి జిల్లా మీదుగా మేడ్చల్‌ – మహబూబ్‌నగర్‌ – డోన్‌ రైల్వేలైన్‌ డబ్లింగ్‌ పనుల్లో కీలక అడ్డంకిగా ఉన్న భూసేకరణ సమస్యకు తెరపడింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పనుల కోసం జిల్లాలోని ఇందల్వాయి మండలంలోని నాలుగు గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లిలో 22.32 ఎకరాలు, సిర్నాపల్లిలో 8.15 ఎకరాలు, గన్నారంలో 3.10 ఎకరాలు, ఇందల్వాయిలో 1.01 ఎకరాల చొప్పున మొత్తం 34.58 ఎకరాల భూమిని రైల్వేలైన్‌ డబ్లింగ్‌ పనుల కోసం సేకరించనున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌ నుంచి నవీపేట వరకు డబ్లింగ్‌ పనులు వేగంగా కొనసాగుతుండగా, ఇందల్వాయి వద్ద సైతం భూసేకరణ పూర్తయితే రైల్వేలైన్‌ విస్తరణ పనులు ఊపందుకోనున్నాయి.

పెరుగుతున్న అంచనా వ్యయం

కొత్త లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రి య కీలకంగా మారింది. నిధుల కేటాయింపుతోపాటు రైతుల నుంచి భూములు సేకరించ డం ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ ప్రక్రి య కోసం ఏళ్లకు ఏళ్లు సమయం పడుతోంది. ఈలోగా అంచనావ్యయం సైతం పెరగడం రై ల్వే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు గండంగా పరిణమిస్తోంది. కొత్తగా రైల్వే లైన్ల నిర్మాణం, ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడుతోంది. రాష్ట్రం నుంచి ఆ స్థాయిలో నిధుల కేటాయింపు లేక రైల్వే లైన్‌ ప్రాజెక్టులు ముందుకు పడటం లేదు. ఈనేపథ్యంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రాధాన్యతనివ్వాలన్న చర్చ కొనసాగుతోంది. అలాగే కనీసం ఏదైనా ఒక్క లైన్‌కై నా కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి పనులు పూర్తిచేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

పూర్తిస్థాయిలో కేంద్ర నిధులపైనే ఆధారం

ప్రతిపాదనలకే పరిమితమైన

కొత్త రైల్వే లైన్లు

ఆర్మూర్‌ – ఆదిలాబాద్‌ కొత్త లైన్‌పై

నీలినీడలు

బోధన్‌ – లాతూర్‌ రైల్వే లైన్ల

భవితవ్యం ప్రశ్నార్థకం

ముద్కేడ్‌ – డోన్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులతో ఊరట

కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలి

ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న కొత్త రైల్వేలైన్లను మంజూరు చేయాలి. కొత్త రైల్వే లైన్లు రద్దయితే ఈ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది. ఆర్మూర్‌ – ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ ద్వా రా ఈ ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగి పరిశ్రమల స్థాపన, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మెరుగవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి సమన్వయంతో కొత్తలైన్ల పనులు చేపట్టాలి. – తౌడు మహేశ్‌, ఆర్మూర్‌

కేంద్రమే భరిస్తే పనుల్లో వేగం

రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదనలో ఉన్న రైల్వేలైన్లలో ఒక్కదానికై నా కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే పనులు పూర్తవుతాయి. రాష్ట్ర వాటా కింద నిధులు ఇవ్వకపోవడంతో కొత్త లైన్లు ప్రతిపాదన దశలోనే ఉంటున్నాయి. ఆర్మూర్‌ – ఆదిలాబాద్‌ రైల్వే ప్రాజెక్ట్‌ ద్వారా హైదరాబాద్‌ వెళ్లేందుకు దూరభారం తగ్గుతుంది. బోధన్‌– లాతూర్‌ లైన్‌ ద్వారా పూణేతో పాటు కొల్హాపూర్‌, పండరీపూర్‌ వంటి పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది.

– ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు

మూడేళ్ల కిందటే సర్వే..

మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి జిల్లాలోని బోధన్‌, నిజామాబాద్‌ వరకు చేరుకునేలా ప్రతిపాదించిన లాతూర్‌ – బోధన్‌ రైల్వేలైన్‌ పూర్తయితే పూణేకు నేరుగా కనెక్టివిటీ కలుగనుంది. పూణే నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కొల్హాపూర్‌, పండరీపూర్‌ మీదుగా నిజామాబాద్‌ చేరుకునేందుకు దూరభారం 350 కి.మీ నుంచి 129 కి.మీటర్లకు తగ్గనుంది. ఈ మార్గంలో కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ.2,482 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మూడేళ్ల కిందటే సర్వే ఫైనల్‌ లొకేషన్‌ మంజూరైనా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల కేటాయింపు సమస్యతో ఈ లైన్‌ సైతం మరుగునపడే పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement