డిచ్‌పల్లి: విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సోమవారం జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మాదిగ కుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
నిజామాబాద్ అర్బన్: జిల్లా మాదిగ కులాల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుర్రాల మహేష్, ప్రధాన కార్యదర్శిగా రాజు గగన్, కోశాధికారిగా భూమన్న, ఉపాధ్యక్షులుగా గంగాధర్, గంగయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అధ్యక్షులు మాట్లాడుతూ..మాల ఉప ికులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు పెంచడానికి చేస్తున్న డిమాండ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వర్గీకరణ సరైందని దీనిని ఎవరు మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. లేకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. సంఘం నాయకులు కేశపురం రమేష్ సురేష్ కుమార్, భూమన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి
సిరికొండ: యాసంగి సీజన్‌లో వరి పంటకు బదులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు మండల ఏవో టి.నర్సయ్య ఒక ప్రకటనలో సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రత బాగా పెరిగి భూగర్భజలాలు తగ్గే అవకాశం ఉందన్నారు. బోరుబావుల్లో నీళ్లున్నప్పటికీ రానున్న రోజుల్లో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వరి పంటకు బదులుగా ఆరు తడి పంటలైన మొక్కజొన్న, ఎర్రజొన్న, తెల్లజొన్న, పొద్దు తిరుగుడు, కుసుమలు, శనగలు, కూరగాయలు సాగు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి పరిస్థితిని అంచనా వేసుకొని వరి సాగుకు వెళ్లవద్దని తెలిపారు. పంట మార్పిడి వల్ల నేలలో సేంద్రియ కార్బనం నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుందని ఏవో తెలిపారు.
అనాథ వృద్ధులకు కొత్త దుస్తుల పంపిణీ
డిచ్‌పల్లి: దసరా పండుగ సందర్భంగా డిచ్‌పల్లి మండలం రాంపూర్‌లోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులకు సోమవారం రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్ బుస్స అంజనేయులు, వారి కుటుంబ సభ్యులు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనాధ వృద్ధుల్లో మాకు ఎవ్వరూ లేరనే ఆలోచన రావద్దని, మీ కోసం మేమున్నామని తెలుపుతూ వాళ్లను ఆదరించి ఆశీర్వాదం పొందాలని ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. పెద్దలని ఆదరిద్దాం.. వారిని గౌరవిద్దాం.. వారు గౌరవంగా బ్రతికేటట్టు చూద్దామని బుస్స ఆంజనేయులు అన్నారు. ముఖ్యంగా యువత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని పెద్దలను గౌరవించాలని కోరారు.
పడకల్‌లో.. అన్నదానం


