భూవివాదాన్ని పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

భూవివాదాన్ని పరిష్కరించండి

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

రుద్రూర్‌: అక్బర్‌నగర్‌లో తమ స్థలంపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాలని బాధితులు రోహిత్‌కుమార్‌, జాన్సీ, శ్రీలక్ష్మి కోరారు. ఈమేరకు వారు సోమవారం పురుగుమందు డబ్బాతో మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని కోరారు. తమ స్థలంలో వేసిన కంచెను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కొందరు తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు.

హిందువుల

ఐక్యతతోనే దేశాభివృద్ధి

కమ్మర్‌పల్లి: దేశంలో హిందువుల ఐక్యత పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉత్సవాలతో భక్తి భావం పెరుగుతుందన్నారు. మండపాల్లో కొలువుదీరిన దుర్గాదేవీ నవ రాత్రులు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తూ, విజయదశమి రోజున మహిశాశుర మర్దినిపై విజయం సాధిస్తుందన్నారు. భారత్‌ చుట్టూ ఉన్న దేశాలన్నీ సమస్యల వల యంలో చిక్కుకున్నాయని, హిందువులు జా గ్రత్తగా లేకపోతే విధ్వంసకర శక్తులు భారత్‌ను నాశనం చేయాలని చూస్తున్నాయన్నారు. ఉ ట్నూర్‌ రాజశేఖర్‌, మర్యాల నాగభూషణం, మంతెన ప్రదీప్‌, నాంపల్లి రవిచంద్ర, చంద్రమోహన్‌, నరేష్‌ సల్లూరి కిషన్‌, దొంతుల రమణయ్య, నరేందర్‌ డిష్‌ తదితరులున్నారు.

ప్రజావాణికి దరఖాస్తులు నిల్‌

వర్ని: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు రాలేవని వర్ని ఎంపీడీవో వెంకటేశ్వర్‌ వెల్లడించారు. కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

ఉపాధి హామీ కూలీ మృతి

వేల్పూర్‌: రామన్నపేట్‌లో ఉపాధి హామీ కూలీ భగవాన్‌దాస్‌(52) సోమవారం ఉపాధి పని చేస్తూ మరణించినట్లు వీబీ జీ రామ్‌జీ మండల ఏపీవో అశోక్‌ తెలిపారు. భగవాన్‌దాస్‌ పనులకు హాజరై ఎప్పటిలాగే పనిచేస్తుండగా గుండెపోటుకు గురై పడిపోయాడన్నారు. వెంటనే అంబులెన్స్‌లో చికిత్స కోసం ఆర్మూర్‌కు తర లించగా అప్పటికే మరణించాడని పేర్కొన్నా రు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు పేర్కొన్నారు.

నేటి నుంచి కేదారానంద అనుష్టాన దీక్ష

నందిపేట్‌(ఆర్మూర్‌): మండల కేంద్రంలోని కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని మంగళవారం వేకువ జామున అనుష్టాన దీక్షలోకి వెళ్లనున్నట్లు ఆశ్రమ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడు దసరా రోజు కేదారానంద స్వామి దీక్షలోకి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. దీక్షలోకి వెళ్లిన నాటి నుంచి 36 రోజులు దీక్షభూని కార్తీక పౌర్ణమి రోజున దీక్ష విరమించి గది నుంచి బయటకు వస్తారు. అనంతరం భక్తులకు శ్రీ కేదారనందస్వామి దర్శనం ఇస్తారు. సోమవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు కేదారీశ్వర ఆశ్రమానికి చేరుకుని భజనలు చేస్తూ భగవంతున్ని కొలుస్తున్నారు.

24 క్యారెట్స్‌ 1,50,000

22 క్యారెట్స్‌ 1,35,432

వెండి(కిలో) 2,23,000

– నిజామాబాద్‌ బిజినెస్‌

బంగారం ధరలు (10గ్రాములు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement