దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసురమర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు. పలు చోట్ల మహిళలు, దేవి మాలధారులు బోనాలు ఎత్తుకొని వెళ్లి నైవేద్యం అమ్మవారికి సమర్పించారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపులో శివసత్తుల చిందులు, డప్పు బృందం కళానాట్యాలు ఆకట్టుకున్నాయి. – సాక్షి నెట్‌వర్క్


